శ్రీకాకుళం జిల్లాలో యువ మంత్రి సీదిరి అప్పలరాజు దూకుడు ఎక్కువగా ఉందా? వైసీపీ నేతలకు ఇది మింగుడు పడడం లేదా? అంటే.. ఔననే అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. ముఖ్యంగా టీడీపీ నేతల కు చెక్ పెట్టే విషయంలో ఇప్పటి వరకు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ సహా పలువురు నాయకులు దూకుడుగా ముందుకు సాగలేకపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాలు.. ఇతర ఈక్వేషన్స్ కారణంగా నాయకులు ముందుకు సాగలేకపోయారు. అయితే.. ఇప్పుడు సీదిరి మాత్రం దూకుడుగా ముందుకు సాగుతున్నారు.