తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాల్లో క్రేజ్ ఉన్న పవన్‌కు రాజకీయాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ అది ఓట్ల రూపంలో రావడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతుంది. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్ధతు ఇవ్వడంతో, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జనసేన కార్యకర్తలు భావించారు. అదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు.