ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ సృష్టించిన కల్లోలానికి కళ్లెం వేసేందుకు కొవిడ్ వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ ఆమోదించింది. అత్యవసర వినియోగానికి అనుమతులను ఇచ్చింది.