పవన్ కల్యాణ్ మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పుడప్పుడు బయటకొచ్చి, చంద్రబాబు ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. ఇక మధ్యలో టీడీపీ-బీజేపీలతో విభేదించి వారిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాకైనా కాస్త యాక్టివ్‌గా ఉండి జనసేనని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు.