ఇటీవల పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటన రాజకీయ యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సాయం చేయాలని పవన్ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చారు. ఇక రావడం రావడమే ఆయన, జగన్ కేబినెట్లో కీలకంగా ఉన్న కొడాలి నాని, పేర్ని నానిలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు లేని విధంగా పవన్, వ్యక్తిగతంగా నానీలని టార్గెట్ చేశారు.