జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నుంచి పరిపాలనను విశాఖపట్నానికి తరలించడానికి గత ఏడాది పొడవునా ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు.... అయినా ఓ పట్టాన అనుకున్న పని పూర్తి కావడం లేదు. ఊహించని రీతిలో ఇబ్బందులు ప్రభుత్వాన్ని చుట్టు ముట్టాయి. జగన్ సర్కారు మూడు రాజధానుల విషయంలో ఎంత క్లారిటీ ఇచ్చినా... అది ఓ కొలిక్కి రావడంలేదు.