ఏపీ టీడీపీలో మంచి క్రేజ్ ఉన్న యువ నాయకులు చాలామందే ఉన్నారు. అయితే వారిలో బాగా క్రేజ్ ఉన్నవారిలో రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్‌లు ముందు వరుసలో ఉంటారు. వీరికి వారసత్వంగానే రాజకీయాలపై మంచి పట్టుంది. వీరి తండ్రులు టీడీపీలో కీలకపాత్ర పోషించారు. ఎర్రన్నాయుడు, పరిటాల రవిలు అంటే తెలియని వారుండరు. ఇక వారి మరణం తర్వాత యువ నేతలు రాజకీయాల్లోకి వచ్చారు.