ఈ దుశ్చర్యకు ఉపయోగించిన రంపం దొరికిందని అలాగే మరి కొన్ని ముఖ్యమైన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇది ఒక వేళ దొంగతనం గనుక అయితే గుడిలో ఎటువంటి నగలు కానీ ఇతరత్రా వస్తువులు కానీ వారు తీసుకోలేదని, కేవలం రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇది చేసారని, అతి త్వరలోనే నిస్పక్షపాతంగా దర్యాప్తును జరిపి దీనికి కారణమయిన దుండగులను పట్టుకుంటామని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.