ఏపీలో రామతీర్ధం ఘటనపై రాజకీయం హాట్ హాట్ సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల గుర్తు తెలియని కొందరు రామతీర్ధంలోని రాముడి విగ్రహం శిరస్సు తీసి కోనేటిలో పారేశారు. ఇక ఈ ఘటనపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా టీడీపీ, జగన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. జగన్ క్రిస్టియన్ కాబట్టే, హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు.