రాష్ట్రంలో ఆలయాల విషయంపై రాజకీయం నడుస్తుంటే, శ్రీకాకుళం జిల్లాలో కులంపై రాజకీయం నడుస్తోంది. అక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రం సాగుతుంది. ఇక వీరి రాజకీయంలోకి స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్నని సైతం తీసుకొచ్చారు. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ నేతలు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఆ అక్రమాలకు ఇప్పుడు చెక్ పెడుతున్నామని, అలాగే ఇలాంటి భూముల్లో ఉన్న గౌతు లచ్చన్న విగ్రహం కూడా తొలగించడానికి వెనుకాడమని మాట్లాడారు.