ఏపీలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య స్థానిక ఎన్నికల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాను పదవి నుంచి తప్పుకునే లోపు ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉంటే, నిమ్మగడ్డ తప్పుకున్నాకే ఎన్నికలు పెట్టుకోవాలని జగన్ ప్రభుత్వం ఫిక్స్ అయి ఉంది. అయితే వీరి మధ్య ఎప్పటి నుంచో వార్ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా అయితే నిమ్మగడ్డ, ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు.