అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జిల్లాలో పలు నియోజకవర్గాలపై పరిటాల ఫ్యామిలీకి పట్టు ఉంది. పరిటాల రవి ఉన్నప్పుడు జిల్లాలో టీడీపీ ఆధిక్యం స్పష్టంగా ఉండేది. ఇక ఆయన మరణించాక కూడా, సునీత లీడ్ తీసుకున్నారు. అయితే సునీత రాప్తాడు వరకే పరిమితమయ్యారు. ఆమె అక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.