ఏపీ రాజకీయాల్లో బాగా బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందటే అది జగన్ సారథ్యంలోని వైసీపీ అని ఠక్కున చెప్పేయొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ సృష్టించిన సునామీ ఎవరు మర్చిపోరు. ఊహించని విధంగా వైసీపీకి 151 సీట్లు వచ్చేశాయి. అలాగే 50 శాతం పైనే ఓట్లు వచ్చాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలల కాలంలో వైసీపీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే 50 శాతం పైనే ఓట్లు వైసీపీకి ఉన్నాయని, ఈ మధ్య వచ్చిన పలు సర్వేలు తేల్చి చెప్పాయి.