2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. ఆ ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. అలాగే చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు, జగన్ కేసుల గురించి అనేకసార్లు ఎద్దేవా చేశారు. జైలు నాయకుడు అని, బెయిల్ మీద బయట తిరుగుతున్నారని అసెంబ్లీ, బయట విమర్శలు చేశారు.