పెళ్లయిన కొడుకైనా సరే... ఎలా అయితే కుటుంబ సభ్యుడిగా భావిస్తారో అదే తరహాలో పెళ్లైన కుమార్తెను సైతం కుటుంబ సభ్యురాలిగా పరిగణించాలని మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్ ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.