జనసేన తరుపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్...ఇప్పుడు వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి రాపాక వైఖరి కాస్త అనుమానాస్పదంగానే ఉండేది. మొదట్లో కొన్నిరోజులు పార్టీలో తిరిగిన రాపాక, తర్వాత నుంచి మారిపోయారు. అసెంబ్లీలో జగన్కు భజన చేయడం మొదలుపెట్టారు. అలాగే సంక్షేమ పథకాల అమలు సమయంలో జగన్కు పాలాభిషేకాలు కూడా చేశారు.