ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి నెక్స్ట్ అధికారంలోకి వచ్చేయాలనే విధంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష టీడీపీని సైడ్ చేసేసి, అధికార వైసీపీకి చెక్ పెట్టేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎలా ఉన్నా, నెక్స్ట్ పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనే అంశమే ఎక్కువగా జనసైనికులని ఇబ్బంది పెడుతుంది.