ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. పరిస్థితులు బట్టి మారిపోతాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించి, కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపొయిన అఖిలప్రియ..కర్నూలు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే.