హిందూపురం....టీడీపీ కంచుకోట. అందులో రెండో మాట లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఇంకో పార్టీ గెలిచిన దాఖలా లేదు. 1983 నుంచి చూసుకుంటే 2019 వరకు ఇక్కడ పసుపు జెండా హవా ఉంది. అలాగే హిందూపురం నందమూరి ఫ్యామిలీ అడ్డా కూడా. ఇక్కడ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణలు గెలిచారు. ఇక గత రెండు పర్యాయాలు నుంచి బాలయ్య సత్తా చాటుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ బాలయ్య వరుసగా గెలుస్తున్నారు.