ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి ఓ ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రణాళికకు పలు అర్థాలు వినబడుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఒక అర్థం చెబుతుంటే.... ఇతర పార్టీ నేతలు మరో అర్థం చెబుతున్నారు. "నేను ఉన్నాను... నేను విన్నాను" అన్న సీఎం జగన్.... తాను ఇచ్చిన నవరత్నాలు హామీలలో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.