ప్రతిపక్షం ఒకవైపు దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదలకుండా అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉన్నట్టుండి దేవుని ఆలయాలపై దాడులు జరగడం మొదలయ్యాయి. దీనితో రాష్ట్రంలో మత రాజకీయాలు రంగు పులుముకున్నాయి.