కరోనా నిబంధనలను పాటిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించాలంటూ ఆదేశించింది ప్రభుత్వం. కోవిడ్ నిబంధలను ఏ మాత్రం విస్మరించకూడదు అని హెచ్చరించింది. కాగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో అందరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపుతారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.