ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో టీడీపీ సత్తా చాటనుందా ? ఇక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీ నాయకుడు, యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. దూకుడు పెంచుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వరుస ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు.. గ్రామీణ ప్రాంతాలకు ఆయన అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారు. గత 2014లో విజయం సాధించిన ఏలూరి.. టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి వెనుకబడిన ప్రాజెక్టులు ప్రాణం పోసుకున్నాయి.