కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ నిబంధనల ప్రకారం శానిటైజర్లు, మాస్కులను ఏర్పాటు చేసి అన్నింటినీ దగ్గరుండి సమీక్షిస్తున్నారు పోలీసులు. ఓటర్లు టెంపరేచర్ ను చెక్ చేసి ఒకవేళ అధిక ఉష్ణోగ్రత నమోదు అయితే.. అటువంటి వారికి చివరి ఒక గంట ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు