అనంతపురం జిల్లాలో మొత్తంగా 169 పంచాయితీలకు ఎన్నికలు జరుగగా అత్యధికంగా 148 స్థానాలను వైసీపీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకోగా మిగిలిన 21 స్థానాలను టీడీపీ బలపరిచిన అభ్యర్థులు దక్కించుకున్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ ప్రభంజనం ఎంతలా ఉందో అర్ధమవుతోంది.