పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న కీలక నేతలు, కార్యకర్తలు లోటస్ పాండ్ కు వచ్చి షర్మిలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రారంభించేందుకు గాను...జెండా ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రకటించాలి? సభ్యులెవరు అన్న అంశంపై షర్మిల తన శ్రేయోభిలాషులతో మరియు ప్రముఖ రాజకీయ సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.