గడిచిన పల్లె పోరులో పూర్తిగా వన్ సైడ్ వార్ నడిచిందని చెప్పాలి. దీనికి తార్కాణమే జగనోరికి పల్లెలిచ్చిన ఘనమైన తీర్పు. ఇక ఈ తీర్పుతో బాబోరి పరిస్థితి తలకిందులయిపోయింది. ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో కూడా తన మంత్రం పనిచేయలేదంటే చూడండి, బాబోరిపై ఏ స్థాయిలో ప్రజాగ్రహం ఉందో.. కుప్పం నియోజకవర్గంలో ఉన్న 89 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 14 గ్రామ పంచాయతీలు మాత్రమే టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది.