ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి మరియు ప్రత్యర్థి పార్టీ టిడిపి కి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ నేతపై ఓ రేంజ్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మరియు ఏపీ మంత్రి. దాంతో మరోసారి ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. వైయస్సార్సీపి మంత్రి శంకర్ నారాయణ టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి పై విమర్శల తుఫాన్ కురిపించారు.