చంద్రబాబు పంచాయతీ ఎన్నికలలో జరిగిన ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కనీసం నగర మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలలో అయినా తమ సత్తా చాటాలని తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రాసెస్పైనా, ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనా ఆయన పార్టీ నేతలు సమాలోచనలు జరిపారు.