నిన్న మొన్నటి దాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రంగంలో ఎంత సెగలు పుట్టించాయో అందరికీ తెలిసిందే. హోరా హోరీగా సాగిన ఈ పల్లె పోరులో అధికార పార్టీ వైసిపి తన సత్తా చాటింది. ఇటు టిడిపి సైతం గట్టి పోటీ ఇవ్వడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. అలా ఆ పంచాయతీ ముగిసిందో లేదో ఇలా మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైపోయింది.