ఏపీలో ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. ఇంతలో మళ్ళీ మరో ఎన్నికల పిటీషన్ తో అన్ని రకాల రాజకీయ పార్టీలకు మరియు కార్య కర్తలకు నిదుర లేకుండా చేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇక అప్పటి నుండి మళ్ళీ రాజకీయ రానా రంగం షురూ అయ్యింది. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఎలా అయితే ఎన్నికలు జరిగాయో అదే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.