తెలంగాణ రాష్ట్రంలో పాలన పరంగా ప్రజల నుండి మిశ్రమ స్పంద వస్తున్నప్పటికీ దేశ రాజకీయాల పరంగా ఈ రాష్ట్రానికి మంచి పేరే ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు అమోఘం అని అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గడిచిన సంవత్సరం దేశమంతా కరోనా ప్రభావముతో అభివృద్ధి నత్త నడకన సాగింది.