ఏ ముహూర్తంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారో కానీ ఇది కొనసాగేలా లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అంతా బాగానే ఉన్నా, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అమరావతికి కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్ ప్రభుత్వం అమరావతిని తాత్కాలిక రాజధానిగా చేసి మూడు రాజధానుల నిర్ణయానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఎలాగూ అసెంబ్లీలో వైసీపీకి బలం ఉంది కాబట్టి బిల్లు పాస్ అయింది.