ఏపీలో పంచాయతీ ఎన్నికలు మొదలైనప్పటి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు అధికార పార్టీ కి మధ్య చెలరేగిన పోరు ఈ రోజుకీ అదే రేంజులో కొనసాగుతూ ఉంది. పల్లె పోరు ముగియ గానే నగర స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గడిచిన పల్లె పోరులో ప్రభుత్వం తరపున వాలంటీర్లు ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీని వలన ప్రతి పక్ష టీడీపీ కొన్ని పంచాయతీలలో ఓటమి చెందామని అప్పట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనీసం జరగబోయే నగర స్థానిక ఎన్నికలలో అయినా వాలంటీర్ల పాత్రను నిషేధించాలి అని ధ్వజమెత్తింది.