ఏపీలో రాజకీయాలు జగన్ పార్టీ ఆవిర్భావం నుండి కొత్త మలుపును తీసుకున్నాయని చెప్పవచ్చు. అప్పటికే ప్రత్యేక తెలంగాణ ఇచ్చేసిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గింది. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో జగన్ పార్టీ నుండి బయటకు వచ్చేసి వైస్సార్సీపీ ని స్థాపించారు. ఆ తరువాత 2014 లో మొదటి సారి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి తన ఉనికిని చాటుకున్నారు.