ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే తాజాగా తీసుకున్న ఒక నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. మార్కాపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు భహిష్కరిస్తున్నామని ఆ ఆపార్టీ నాయకుడు కందుల నారాయణరెడ్డి ప్రకటించారు. ఈయన నిర్ణయానికి కట్టుబడి ఎవరెవరు అయితే టీడీపీ అభ్యర్థులు నామినేషన్ లు వేశారో దీనికి అంగీకారం తెలిపారు. దీనికి కారణాలుగా పలు విషయాలను కందుల నారాయణరెడ్డి ప్రస్తావించారు.