ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సంతోషమే అంతిమ లక్ష్యంగా అన్ని సంక్షేమ పధకాలను ప్రెవేశపెట్టారు. అవి సక్రమంగా ప్రజలకు అందేలా ప్రణాళికను చేశారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ సమస్యను పారదోలడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి లక్షల మందికి ఉపాధిని కల్పించారు.