కరోనా వైరస్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. ఇప్పటికీ దాని తీవ్రత చాలా దేశాలలో కొనసాగుతూ ఉంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశంలోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మొదటిగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వివిధ కారణాల వలన ఒకరిద్దరు చనిపోయారు. ఈ విషయాన్ని మీడియా పదే పదే ప్రొజెక్ట్ చేసి ప్రజలలో వ్యాక్సిన్ వేసుకోవడం ప్రమాదం అన్న భావం కలిగేలా చేశారు.