ఆంధ్రప్రదేశ్ లో గడిచిన పంచాయతీ ఎన్నికలు టీడీపీకి ఒక మరిచిపోని పీడకల అని చెప్పవచ్చు. ఎప్పటి నుండో కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ కంచుకోటల్లోనే వైసీపీ తన విజయభేరిని మోగించడం ఇప్పటికీ టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. దీనితో టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి జంపింగ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది టీడీపీ పని ఇక పోయిందని మారుతుంటే, జగన్ ముందు చంద్రబాబు నిలబడలేదు అని మరి కొంతమంది పార్టీ మారుతున్న పరిస్థితి.