ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆ పార్టీకి ఒక ఎంపీ నుండి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు. మొదట్లో ఏదో ఆపదవిని ఆశించి, దానికి వైసీపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో తన పంతాన్ని మొదలుపెట్టిన రఘు రామ నేటికీ అదే లెవెల్ లో అధికార పార్టీ పై మరియు ప్రభుత్వంపై దొరికినప్పుడల్లా తన ఆగ్రహాన్ని చూపిస్తున్నాడు.