ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ సమస్యా లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిందో అప్పుడే ప్రారంభమయింది అసలు కష్టం. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎలాగోలా రాష్ట్రాన్ని అయితే నడిపించగలిగాడు కానీ, ఆర్ధిక పరంగా ఎన్నో సవాళ్ళను అధిగమించాల్సి వచ్చింది.