దేశ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ అసలు ఎవరికీ లెక్కలో కూడా లేడని చెప్పాలి. అలాంటిది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ని రెచ్చగొట్టి, కేసీఆర్ గురించి లేని పోని విషయాలను సోనియా గాంధీకి చెప్పడంతో, ఎలాగూ అప్పట్లో వైఎస్సార్ కూడా లేకపోవడంతో, ఇదే అదనుగా భావించిన కేసీఆర్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించడంలో సఫలీకృతుడయ్యాడు.