ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎన్నికల వేళ కొత్త కొత్త సవాళ్లతో అట్టుడికిపోతోంది. ముగిసిన పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎక్కువ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకుని మరోసారి ప్రజలు తమ వైపే ఉన్నారని నిరూపించుకున్నారు. ఈ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీడీపీ కి భంగపాటు తప్పలేదు. ఎన్నడూ లేనంతగా ప్రజల ఆగ్రహానికి చంద్రబాబు పార్టీ గురైందని చెప్పవచ్చు.