ఆంధ్రప్రదేశ్ లో పురపాలక ఎన్నికలవేళ సొంత పార్టీలోని నేతల మధ్యన వివాదాలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ టీడీపీ కి చెందిన ప్రధాన నాయకులు ఎంపీ కేశినేని నాని మరియు బుద్దా వెంకన్నకు మధ్యన తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇవన్నీ కూడా పురపాలక ఎన్నికల సందర్భంగా మేయర్ అభ్యర్థిగా పోటీ కోసం తమకు నచ్చిన వ్యక్తికి అవకాశం ఇవ్వకపోవడం అంటున్నారు.