రాజకీయాలలో పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం సదా మామూలే. ఇలాంటివి దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ చూస్తూ ఉంటాము. అయితే వివిధ రాజకీయ ఒత్తిళ్ల వలన కావొచ్చు లేదా రాజకీయ లాభాల వలన కావొచ్చు, నువ్వెంతంటే నువ్వెంత అని తిట్టుకున్న నాయకులు సైతం కలిసిపోయే పరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏపీలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది.