రాజకీయ సమీకరణాలు ఎప్పుడెలా మారుతాయో ఎవ్వరూ చెప్పలేము. ఒక్కోసారి ప్రజల్లో మంచి పేరున్న పార్టీలు కూడా ఘోరంగా ఓడిపోతాయి. దీనికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇలాంటివి జరగడానికి చాలానే కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఒక కారణం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. ఏపీలో రేపు జరగబోయే నగర మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలోని ఎమ్మెల్యే లు మరియు ఎంపీలు అభ్యర్థుల ఎంపిక మరియు గెలుపు కోసం రకరకాల వ్యూహాలను వాటి ప్రణాళికలను చూసుకుంటున్నారు.