సాధారణంగా ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ హడావిడి మాములుగా ఉండదు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అంచనాలు కొన్ని సార్లు కరెక్ట్ అవుతుంటాయి, మరి కొన్ని సార్లు తప్పు అవుతుంటాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ పైన అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు పూర్తిగా ఆధారపడుతుంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే ఫలితాల అంచనాలు గెలిచే అభ్యర్థులలో కొంతమేర సంతోషాన్ని పెంచుతాయి.