ఎట్టకేలకు ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ప్రజలంతా తమ ఓటు హక్కును సమర్ధవంతంగా వినియోగించుకున్నారు. ఇక తరువాయి భాగం, రాబోయే ఫలితాల కోసం ఎదురుచూపులు మాత్రమే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు గెలుపు సమీకరణాలపై చర్చల్లో తలమునకలై ఉంటారు. అయితే ఎప్పటిలాగే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తమ అంచనాలతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి.