ఏపీలో ప్రస్తుతం అందరి దృష్టి ఎన్నికల నుండి ఎన్నికల ఫలితాల వైపుకు మళ్లింది. ఎన్నో వివాదాల మధ్యన ముగిసిన ఏపీ స్థానిక ఎన్నికలు ఫలితాల ప్రకటనతో చివరి ఘట్టాన్ని కూడా 14 వ తేదీన ముగించుకోనున్నాయి. అయితే ప్రజలు ఏ పార్టీకి తమ మద్దతును ఇచ్చారో తెలియాలంటే మరో మూడు రోజుల వరకు ఆగాల్సిందే. అయితే ఈ లోపు రాజకీయ పార్టీలు ఎన్నికల సరళిని మరియు వారి గెలుపు అవకాశాలను ఒకసారి ఆకళింపు చేసుకుంటున్నాయి.