ఏపీలో నగర పాలక స్థానిక ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. నిమ్మగడ్డ ముందు నుండి చెబుతున్నట్లుగానే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. దీనికి ప్రభుత్వం నుండి మంచి సహకారం అందిందనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్యన ఎన్నికలకు వెళ్లిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎక్కడ ఎవరు గెలుస్తారు...? మనము ఎన్ని మునిసిపాలిటీలు గెలుస్తాము? ఎన్ని కార్పొరేషన్ లు గెలుస్తాము అనే లెక్కల్లో ఉన్నారు.